Venkatesh1

Feb 02 2024, 08:05

చంద్రబాబు నాయుడు గారిని 2024 లో ముఖ్యమంత్రి చేసుకుంటాం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు..
చంద్రబాబు నాయుడు గారిని 2024 లో ముఖ్యమంత్రి చేసుకుంటాం.. రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు.. ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు, ముంటిమడుగు కేశవరెడ్డి గారి ఆదేశాల మేరకు* నార్పల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జిలు, యూనిట్ ఇంఛార్జి లు, బూత్ ఇంఛార్జి లకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు పాల్గొన్నారు.ట్రైనర్ నీలు స్వామి గారు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి క్లస్టర్ ఇంఛార్జి లు,యూనిట్ ఇంఛార్జి లు,బూత్ ఇంఛార్జి లు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. సైకో జగన్ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలంటే మనమందరం కష్ట పడి పనిచేసి కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు.ఈ సైకో జగన్ వల్ల ఈ రాష్ట్రం భవిష్యత్ అంధకారం అయ్యింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన భాధ్యత మనందరి పైన ఉందన్నారు.తెలుగుదేశం పార్టీ మహాశక్తి సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంఛార్జి లు, బూత్ ఇంఛార్జి లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Venkatesh1

Feb 02 2024, 07:57

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం.. నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శంకర నారాయణ..
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం - మీ అందరి దీవెనలతో మరోసారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం: నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించిన జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శంకర నారాయణ , శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు నాయకులను కార్యకర్తలను కోరారు. బుక్కరాయసముద్రం మండలంలోని నీలాంపల్లి, జంతులూరు, కొర్రపాడు, నీలారెడ్డిపల్లి, రోటరీపురం, రెడ్డిపల్లి, అమ్మవారిపేట, రేకులకుంట, దయ్యాలకుంట పల్లి, వెంకటాపురం చెన్నంపల్లి, బొమ్మలాటపల్లి, సంజీవపురం కె కె. అగ్రహారం గ్రామాల్లో వీరాంజనేయులుతో కలసి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి పర్యటించారు. ముందుగా నీలాంపల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద నమ్మకంతో నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారని మీ ఆశీస్సులతో గెలిపించాలని విన్నవించుకున్నారు. సమన్వయంతో అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధి కొరకు‌ మరియు అందరికీ అందుబాటులో ఉంటూ నా వంతు కృషి చేస్తానని తెలిపారు. వారు మాట్లాడుతూ... జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మేలు జరిగిందన్నారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Jan 31 2024, 07:33

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం... ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు..
బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం... ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు.. శిoగనమల నియోజకవర్గం,నార్పల మండలo బి పప్పూరు గ్రామ సమీపనా షిరిడి సాయి ఆలయం ఆవరణoలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో * *జయహో బీసీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శిoగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు*ముంటిమడుగు కేశవరెడ్డి గారు*, జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు.* ఈ కార్యక్రమానికి *జిల్లా బిసి సెల్ అధ్యక్షులు అవుల కృష్టయ్య*,అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాల పెద్దపీట వేసిందన్నారు. బీసీల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో బీసీ సబ్ ప్లాన్ లను ఏర్పాటు చేసి ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. వైసిపి ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మొండి చేయి చూపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీకి బీసీల సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపి వైసిపిని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు శ్రీకారం చుట్టి బీసీల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. వైసిపి ప్రభుత్వం బీసీలను ఓట్ల కోసమే వాడుకుని పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని తెలియజేసారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర్ల సంఘం అధ్యక్షులు వెంకట్ గారు, కురబ రాష్ట్ర సంఘం అధ్యక్షులు గంగులకుంట రమణ, కుమ్మర రాష్ట్ర సంఘం అధ్యక్షులు పోతలయ్య, రాష్ట్ర కార్యదర్శి కురభ శివబాల, జిల్లా నాయకులు వెంకట నరసా నాయుడు గారు,వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వన్నూరప్ప, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నారాయణస్వామి, టి ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు బ్యాల్ల నాగేంద్ర, జిల్లా అధికార ప్రతినిధి పరశురాం, జిల్లా బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యగూరు పెద్దన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Venkatesh1

Jan 31 2024, 07:27

నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన మైఖోం నిదియా దేవి ఐ.ఎ.యస్ గారిని జిల్లా ఎంపీపీల సంఘం తరఫున మర్యాదపూర్వకంగా కలసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత
ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారిణిగా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి మైఖోం నిదియా దేవి ఐ.ఎ.యస్ గారిని జిల్లా ఎంపీపీల సంఘం తరఫున మర్యాదపూర్వకంగా కలసిన బుక్కరాయసముద్రం ఎంపీపీ దాసరి సునీత గారు మరియు కూడేరు ఎంపీపీ నారాయణ రెడ్డి గారు

Venkatesh1

Jan 31 2024, 07:20

జగనన్న మాట శిరోధార్యం - సమన్వయంతో పని చేద్దాం..నా తమ్ముడు వీరాంజనేయులును గెలిపించుకుందాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..
జగనన్న మాట శిరోధార్యం - సమన్వయంతో పని చేద్దాం..నా తమ్ముడు వీరాంజనేయులును గెలిపించుకుందాం: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. - సామాన్య కార్యకర్తను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టే దమ్ము కేవలం జగనన్నకే ఉంది - జగనన్నకు, ఎమ్మెల్యే దంపతులకు రుణపడి ఉంటాను - నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తాను: వీరాంజనేయులు సామాజిక సమీకరణలో భాగంగా జగనన్న నిలబెట్టిన అభ్యర్థిని సమన్వయంతో కలిసికట్టుగా మనమందరం పనిచేసి గెలిపించుకుందామని వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు కుటుంబం వైఎస్ఆర్సీపీ తరఫున సర్పంచ్ గా ఎన్నికై అక్కడ ప్రజలకు, పార్టీకి సేవలందించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి నా తమ్ముడు వీరాంజనేయులును వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆశీర్వదించాలన్నారు. టిక్కెట్ తనకు ఇచ్చినా ఇవ్వకపోయినా జగనన్న మాటకు కట్టుబడి జగనన్న చేస్తున్న అభివృద్ధిని మరింత బలోపేతం చేయడానికి మాపైన మోపిన నమ్మకాన్ని మేము నిర్వర్తించి వైఎస్ఆర్సీపీ జెండాని నియోజకవర్గంలో ఎగరేస్తామన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచాను, పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో జగనన్న పేదల పక్షాన నిలబడినందుకు కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో కలహాలు నింపడానికి తన సొంత చెల్లెలైన షర్మిలను కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకొని కుటుంబంలో చిచ్చు పెట్టారన్నారు. వైయస్ షర్మిలమ్మ కూడా జగనన్న గొప్పతనాన్ని తెలుసుకొని ఎప్పటికైనా తన చెంతకు వస్తుందన్నారు. తన సొంత చెల్లెలు జగనన్న వైపు లేకపోయి ఉండొచ్చు, ఆంద్రప్రదేశ్ లోని ప్రతి అక్క చెల్లెమ్మలు జగనన్నను అన్న, తమ్ముడిగా భావిస్తూ తన వెంట ఉన్నారన్నారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గతంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా వీరాంజనేయులు కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు యన్.వి నారాయణ, మండల కన్వీనర్ అంకె నరేష్ , ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాయక్,మండల కన్వీనర్ వరకూటి కాటమయ్య, గంగరాజు, రామచంద్ర, నాగలింగా తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Jan 30 2024, 19:01

Flash..Flash..బైక్ ఆక్సిడెంట్ ఓ మహిళ మృతి..

నార్పల మహిళ మార్ట్ దగ్గరా రోడ్డు దాటుతుండగా మహిళ బైక్ ఆక్సిడెంట్ జరిగి మహిళా చనిపోవడం జరిగింది. సాయంత్రము బైక్ యాక్సిడెంట్ వల్ల ఒక మహిళ చనిపోవడం జరిగింది... అబ్బాయి వయస్సు 20 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా ఎక్కువ అతివేగం వెళ్లడం వల్ల యాక్సిడెంట్ జరగడం జరిగింది.. చనిపోయిన మహిళ పేరు రామలక్ష్మమ్మ..

Venkatesh1

Jan 30 2024, 15:59

జగనన్న సంక్షేమ పథకాలే.. విజయానికి సోపానాలు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

జగనన్న సంక్షేమ పథకాలే.. విజయానికి సోపానాలు: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి..

◆ పాల్గొన్న సమన్వయకర్త యం. వీరాంజనేయులు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు వైఎస్సార్సీపీ విజయానికి సోపానాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామంలో డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్, అలాగే ఎల్లుట్ల గ్రామంలో గ్రామ సచివాలయం, డా.వైయస్సార్ రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ విలేజ్ క్లినిక్ ల నూతన భవనాలను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రారంభించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ...గత టిడిపి ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, అప్పట్లో ఏవైనా పథకాలు వర్తించాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చరిత్రలో లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి అందించామన్నారు. జగనన్న పాలనను చూసి ఓటమి భయంతో ప్రతిపక్షాలు కూటములుగా వస్తున్నాయని, వాటిని తిప్పికొడుతూ రాబోయే ఎన్నికలలో జగనన్నని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కోరారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.